మహేందర్ రెడ్డి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు | telangana ministers Visitation to ranga reddy district vice president mahender reddy family | Sakshi
Sakshi News home page

మహేందర్ రెడ్డి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు

May 19 2016 4:39 PM | Updated on Mar 28 2018 11:26 AM

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అకాల మరణం తీరని లోటని మంత్రులు అన్నారు.

నవాబుపేట: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అకాల మరణం తీరని లోటని మంత్రులు మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మహేందర్‌రెడ్డి కుటుంబీకులను గురువారం వారు తిమ్మారెడ్డిపల్లిలో పరామర్శించారు. పార్టీ తరఫున రూ.10 లక్షల చెక్కును వారికి అందజేశారు. మహేందర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం వికారాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేందర్‌రెడ్డి చనిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement