అంబరాన్నంటిన అవతరణ సంబరాలు | telangana formation day celabrations | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన అవతరణ సంబరాలు

Jun 3 2017 2:03 AM | Updated on Sep 6 2018 3:01 PM

అంబరాన్నంటిన అవతరణ సంబరాలు - Sakshi

అంబరాన్నంటిన అవతరణ సంబరాలు

తెలంగాణ అవతరణ వేడుకలు జిల్లా కేంద్రంలో వైభవంగా జరిగాయి.

రెపరెపలాడిన జాతీయ జెండా
ప్రతీ కార్యాలయంలో జెండా వందనం

జగిత్యాల :  తెలంగాణ అవతరణ వేడుకలు జిల్లా కేంద్రంలో వైభవంగా జరిగాయి. వేడుకలు పురాతనమైన ఖిలాలో నిర్వహించారు. అంతకుపూర్వం ప్రతీ కార్యాలయంలో అధికా రులు జెండాలు ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళులర్పించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శరత్‌ జెండా ఎగురవేసి మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చేస్తున్నామన్నారు.

ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో నరేందర్, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ విజ యలక్ష్మీ, ఏరియా ఆస్పత్రిలో సూపరింటెం డెంట్‌ అశోక్‌కుమార్, ఇంజినీరింగ్‌ కార్యాలయం, రోడ్ల భవనాలశాఖ కార్యాలయం, ఐసీడీఎస్‌ కార్యాలయం, వివిధ శాఖల కార్యాలయాల్లో పతాకాలు ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. కొన్ని చోట్ల స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాలోని ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు పాఠశాలలు, వాణిజ్య సంఘాలు, నాయకులు, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు.

జగిత్యాల టౌన్‌ : ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం భవనంలో జగిత్యాలశాఖ కార్యవర్గ సభ్యులు ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లికి పుష్పాలంకరణ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు నలవాల హన్మండ్లు, అత్తినేని రాజమల్లయ్య, వి.మారుతిరావు, జి.అశోక్, కె.రాజయ్య, సిహెచ్‌.నందయ్య, నాగేంద్ర, మనోహర్‌ పాల్గొన్నారు.

టీబీసీ ఐకాస ఆధ్వర్యంలో...
తెలంగాణ బీసీ సంక్షేమ ఐక్య కార్యాచరణ సమి తి జగిత్యాల జిల్లాశాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన 12 మందికి పురస్కారాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు కొండ లక్ష్మణ్, టీ రెవెన్యూ జిల్లా అధ్యక్షుడు వకీల్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో...
టీఎన్జీవోజిల్లాశాఖ ఆధ్వర్యంలో సంఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. టీఉద్యోగ ఐకాస అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, టీఎన్జీవోల నాయకులు సత్యం, ప్రభాకర్, విజయేందర్, తిరుపతి, సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధ్యక్షుడు ఎండి.వకీల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీ పెన్షనర్ల జిల్లాశాఖ ఆధ్వర్యంలో...
తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. ఉద్యమంలో పాల్గొన్న 8 మంది పెన్షనర్లను సంఘం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌ సన్మానించారు. బొల్లం విజయ్, విశ్వనాథం, విఠల్, ప్రకాశ్, సత్యనారాయణ, విద్యాసాగర్‌రావు, కరుణ తదితరులు పాల్గొన్నారు.

టీ–టీడీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో...
జిల్లా కేంద్రంలో టీ–టీడీపీ జిల్లా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న, పట్టణ అధ్యక్షుడు బాలె శంకర్, వొల్లం మల్లేశం, దయాల మల్లారెడ్డి, ఆవారి శివకేసరిబాబు, నవ్వోతు రవీందర్, మారిశెట్టి సూర్యప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement