ఏపీలో కేసీఆర్‌కు ఫ్లెక్సీ | telangana cm kcr flexi hulchul in east godavari district | Sakshi
Sakshi News home page

ఏపీలో కేసీఆర్‌కు ఫ్లెక్సీ

Jan 9 2016 2:12 AM | Updated on Oct 2 2018 7:28 PM

ఏపీలో కేసీఆర్‌కు ఫ్లెక్సీ - Sakshi

ఏపీలో కేసీఆర్‌కు ఫ్లెక్సీ

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అభినందిస్తూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఫ్లెక్సీలు కట్టింది.

వై.రామవరం: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అభినందిస్తూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఫ్లెక్సీలు కట్టింది.


‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల చీకటి జీవితాలకు వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రి వర్యులు’ అన్న విశేషణంతో ‘శతకోటి అభివందనములు’ చెబుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్లో శుక్రవారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.  ఈ ఫ్లెక్సీలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించడంగా భావించిన టీడీపీ నేతలు వాటిని తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement