టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు | tdp mp ravindrababu controversial diologues | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Sep 6 2015 2:53 PM | Updated on Aug 10 2018 7:07 PM

టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi

టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు తిరుపతికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడంపట్ల టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాకినాడ: ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు తిరుపతికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడంపట్ల టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు ముఖ్యమా? రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అని ప్రశ్నించారు. పండగల్లాంటివి భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు.

వినాయక చవితి, దీపావళి పేరుతో నీటిని, వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఏఎంజీ పాఠశాలలో జిల్లా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ను ఎంపీలు తోట నర్సింహం, రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ఇటువంటి పండుగలు భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని చెప్పారు. రాష్ట్రంలో బడ్జెట్ లేనందున పండుగలను కంట్రోల్ చేద్దామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement