గుజరాతీలు నిరక్షరాస్యులు!  | Only illiterate people in Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాతీలు నిరక్షరాస్యులు! 

Apr 6 2026 4:39 AM | Updated on Apr 6 2026 12:30 PM

Only illiterate people in Gujarat

వారిని మోదీ ఫూల్‌ చేశారు 

ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు 

తీవ్రంగా మండిపడ్డ బీజేపీ 

ఇడుక్కి/న్యూఢిల్లీ: గుజరాతీలు నిరక్షరాస్యులంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఆదివారం ఆయన కేరళలోని ఇడుక్కిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘‘గుజరాత్‌ ప్రజలు నిరక్షరాస్యులైనందున ప్రధాని మోదీ వారిని నమ్మించి మోసగించారు. కానీ కేరళ ప్రజలు ఎంతో తెలివైనవారు. అక్షరాస్యులు. వారిని మోదీ, కేరళ సీఎం విజయన్‌ ఏమాత్రం మోసం చేయలేరు’’ అని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గుజరాతీలు, ఉత్తర భారతీయులను ఆయన అవమానిస్తున్నారని ధ్వజమెత్తింది. 

కాంగ్రెస్‌కు ఓట్లేయడం లేదనే అక్కసుతోనే గుజరాత్, యూపీవాసులను ఖర్గే అవమానిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలను గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలు, ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సమర్థిస్తారా అని ప్రశ్నించింది.  విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌) నిబంధనలు మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దీన్ని క్రైస్తవ సంస్థలు, ఎన్జీవోలు, పౌర సంఘాలపై దాడిగా అభివర్ణించారు. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలతో బీజేపీ, మోదీ నిజంస్వరూపం బట్టబయలైందన్నారు. ‘‘సీఎం విజయన్‌ స్వతంత్రుడు కారు. మోదీ చెప్పినట్లే నడుచుకుంటున్నారు’’ అని ఆరోపించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement