ఢిల్లీలో కాలుష్య నివారణకు కీలక చర్యలు.. భారీగా నిధులు | governments rs 22-000 crore plan to fix Yamuna air pollution | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కాలుష్య నివారణకు కీలక చర్యలు.. భారీగా నిధులు

Apr 6 2026 4:43 AM | Updated on Apr 6 2026 4:48 AM

governments rs 22-000 crore plan to fix Yamuna air pollution

ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు మరియు యమునా నదిని శుభ్రపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది.  ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 21 శాతం కాలుష్య నివారణకే కేటాయించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఆదివారం ఈ బడ్జెట్‌ను విడుదల చేశారు. రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ. 1,03,700 కోట్లు కాగా అందులో  రూ. 22,236 కోట్లు దాదాపు 21 శాతం పర్యావరణ సంబంధిత పనులకే కేటాయింపులు జరిపారు. యమునా నది  శుద్ధి కోసం అత్యధికంగా రూ. 6,485 కోట్లు కేటాయించారు.

రాజధాని నగరంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ రవాణా బస్సులు సంఖ్యను పెంచడానికి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడానికి మరియు ప్రజా రవాణాను బలోపేతం చేయడానికి రూ. 4,758 కోట్లు కేటాయించారు. అదేవిధంగా  రోడ్లపై దుమ్మును అరికట్టడానికి మరియు గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 3,350 కోట్లు కేటాయించారు.

అదేవిధంగా మొత్తం 17 ప్రభుత్వ శాఖలు తాము ఖర్చు చేసే ప్రతి రూపాయి పర్యావరణానికి ఎలా ఉపయోగపడిందో నివేదించాలని ప్రభుత్వానికి తెలిపారు. కేవలం డబ్బు ఖర్చు చేయడం మాత్రమే కాకుండా, దాని వల్ల గాలి నాణ్యత ఎంత మెరుగుపడింది. నీరు ఎంత శుభ్రపడింది? అనే అంశాలను స్పష్టంగా చూపాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అదేవిధంగా వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక 'గ్రీన్ ఫండ్'ను ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో గాలి నాణ్యత తరచుగా "తీవ్రమైన"  స్థాయికి పడిపోతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా యమునా నదిలోనూ విషపూరితమైన నురుగు పేరుకుపోవడం వంటి సమస్యలు ఏళ్ల తరబడి పీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో సింహాభాగం కేటాయింపులు వీటికే జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement