శశి విద్యాసంస్థల తణుకు క్యాంపస్ ఇన్‌చార్జి నిమ్మగడ్డ రాజేంద్రప్రసాద్ కుమారుడు రాఘవేంద్ర (26) చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందారు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాఘవేంద్ర ఉద్యోగ విధులకు వెళ్తున్న సమయంలో బస్సు ఢీకొని మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
చెన్నైలో తణుకు యువకుడి దుర్మరణం
Sep 20 2016 11:21 PM | Updated on Sep 4 2017 2:16 PM
తణుకు టౌన్ : శశి విద్యాసంస్థల తణుకు క్యాంపస్ ఇన్‌చార్జి నిమ్మగడ్డ రాజేంద్రప్రసాద్ కుమారుడు రాఘవేంద్ర (26) చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందారు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాఘవేంద్ర ఉద్యోగ విధులకు వెళ్తున్న సమయంలో బస్సు ఢీకొని మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవేంద్ర మృతి పట్ల శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు సంతాపం తెలిపారు. రాజేంద్రప్రసాద్ దంపతులను పరామర్శించి ఓదార్చారు. రాఘవేంద్ర మృతదేహం చెన్నై నుంచి మంగళవారం రాత్రికి తణుకు చేరుకుంటుందని, బుధవారం రాజేంద్రప్రసాద్ స్వగ్రామం ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement
Advertisement