బీపీఎంపై చర్యలు తీసుకోవాలి | Take Action on BPM | Sakshi
Sakshi News home page

బీపీఎంపై చర్యలు తీసుకోవాలి

Jul 19 2016 9:24 PM | Updated on Sep 4 2017 5:19 AM

దౌల్తాబాద్‌: మండలంలోని ఇండాపూర్, కుదురుమళ్ళ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రతి నెలా ఇచ్చే ఆసరా పింఛన్ల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న తపాలా బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ సంతోష్‌కుమార్‌ మంగళవారం డిమాండ్‌ చేశారు

దౌల్తాబాద్‌: మండలంలోని ఇండాపూర్, కుదురుమళ్ళ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రతి నెలా ఇచ్చే ఆసరా పింఛన్ల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న తపాలా బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ సంతోష్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రతి నెలా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని ఈ నెల హస్నాబాద్‌కు వస్తేనే ఇస్తానని ఇప్పటి వరకు పింఛన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని బీపీఎంపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement