టేబుల్‌ టెన్నిస్‌ పోటీల విజేతలు వీరే..! | table tennis winners are.. | Sakshi
Sakshi News home page

టేబుల్‌ టెన్నిస్‌ పోటీల విజేతలు వీరే..!

Nov 30 2016 12:19 AM | Updated on Sep 4 2017 9:27 PM

తణుకు టౌన్‌ : ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంతర కళాశాలల టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు మంగళవారంతో ముగిశాయి.

తణుకు టౌన్‌  : ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంతర కళాశాలల టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో అనపర్తికి చెందిన జీబీఆర్‌ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలవగా. గొల్లల మామిడాడకు చెందిన డీఎల్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. రాజమండ్రి ఎస్‌కేవీటీ కళాశాల విద్యార్థులు తృతీయస్థానం, రామచంద్రాపురం వీఎస్‌ఎం కళాశాల విద్యార్థులు నాలుగోస్థానం పొందారు. బాలికల విభాగంలో రామచంద్రాపురం వీఎస్‌ఎం కళాశాల విద్యార్థినులు విన్నర్స్‌గా, తణుకు ఎస్‌కేఎస్‌డీ విద్యార్థినులు రన్నర్స్‌గా, రాజమండ్రి ఎస్‌కేవీటీ విద్యార్థినులు తృతీయస్థానం స్థానం పొందినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు కళాశాల కరస్పాండెంట్‌ చిట్టూరి సుబ్బారావు, ఏఎంసీ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ జె.చంద్రప్రసాద్, ఆదికవి నన్నయ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి ఎ.సత్యనారాయణ, పీడీలు పాల్గొన్నారు.   
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement