అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల, రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం 30 కంపెనీలతో క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించేలా జైన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం ఎస్వీ డిగ్రీ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు.
వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు ఇది మంచి అవకాశమని, జిల్లాలోని డిగ్రీ, బీటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2017 మార్చి 4న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని డిగ్రీ, బీటెక్ కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. జైన్ యూనివర్సిటీ ఎంబీఏ విభాగం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అశ్విన్, పి.సాయినాథ్‌రెడ్డి, ఎస్వీ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.