‘రావెలపై చంద్రబాబు విచారణకు ఆదేశించాలి’ | sunkara padmasri demands probe against ravela kishore | Sakshi
Sakshi News home page

‘రావెలపై చంద్రబాబు విచారణకు ఆదేశించాలి’

Dec 24 2016 2:50 PM | Updated on Sep 4 2017 11:31 PM

మహిళలను వేధిస్తున్న మంత్రి రావెల కిశోర్‌ బాబును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే పదవి నుంచి బర్త్‌ రఫ్‌ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ డిమాండ్‌ చేశారు.

విజయవాడ: మహిళలను వేధిస్తున్న మంత్రి రావెల కిశోర్‌ బాబును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే పదవి నుంచి బర్త్‌ రఫ్‌ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ డిమాండ్‌ చేశారు. ఆమె శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి రావెలపై విచారణకు ఆదేశించాలన్నారు. గతంలో రావెల కుమారులు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సుంకర పద్మ అన్నారు. మహిళల పట్ల టీడీపీకి, చంద్రబాబుకు ఉన్న గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు.

కాగా ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తనను రావెల హత్య చేయించేందుకు యత్నించారంటూ జానీ మూన్ ఆరోపించడంతో దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీవీ ఆంజనేయులుతో కూడిన ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement