కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గాలు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మంజం శ్రీనివాస్ కోరారు.
మంచిర్యాల సిటీ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గాలు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మంజం శ్రీనివాస్ కోరారు. గురువారం మంచిర్యాలలోని యూనియన్ కార్యాలయంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు పోతున్నాయని ఆవేదన∙వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలకు అనుకూలంగా ఉంటూ దేశంలోని కార్మిక చట్టాలను సవరించే విధానాన్ని కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 45 రోజుల్లోగా సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల కనీస వేతనం రూ.18 వేలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిత్యావసర ధరలను నియంత్రించి, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకాన్ని తగ్గించాలని కోరారు. సమావేశంలో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమాస ప్రకాశ్‌తోపాటు కె.విజయ, పి.సురేఖ, అరుణ, నసీమా ఉన్నారు.