జాతీయస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక | students select to nationlevel games | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక

Sep 30 2016 12:42 AM | Updated on Sep 4 2017 3:31 PM

పెదపాడు : మండలంలోని వట్లూరు సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి టెన్నిస్‌ వాలీబాల్, బేస్‌బాల్‌ క్రీడా పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ తాళ్లూరు ఉమాదేవి తెలిపారు.

పెదపాడు : మండలంలోని వట్లూరు సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి టెన్నిస్‌ వాలీబాల్, బేస్‌బాల్‌ క్రీడా పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ తాళ్లూరు ఉమాదేవి తెలిపారు. ఇటీవల కర్నూలు, పెదపాడుల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు ప్రతిభ చూపినట్టు చెప్పారు. టెన్నిస్‌ వాలీబాల్‌ జాతీయస్థాయి పోటీలకు ఎ.అజిత, వి.సంధ్యారాణి, ఎన్‌.ధనూశ్రీ, ఎం.శ్రావణి ఎంపికయ్యారని, బేస్‌బాల్‌ పోటీలకు పి.మృదుల, సీహెచ్‌ జ్యోత్సాS్నరాణి ఎంపికైనట్టు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement