ఒలింపియాడ్‌లో ఎంపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ | Sakshi
Sakshi News home page

ఒలింపియాడ్‌లో ఎంపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ

Published Thu, Aug 11 2016 9:21 PM

ఒలింపియాడ్‌లో ఎంపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ

  • మెుదటి ర్యాంకర్‌ శ్రీమహాలక్ష్మికి స్వర్ణపతకం
  • సాయిభార్గవికి 7, హర్షిత్‌కు 10 ర్యాంకులు
  • మండపేట :
    సొసైటీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో గత ఫిబ్రవరిలో జరిగిన ఒలింపియాడ్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులు పలు పతకాలు అందుకున్నట్టు పట్టణానికి చెందిన మండపేట పబ్లిక్‌ స్కూల్‌ (ఎంపీఎస్‌) కరస్పాండెంట్‌ వల్లూరి చిన్నారావు తెలిపారు. 9వ తరగతి విద్యార్థిని ఎ.శ్రీమహాలక్ష్మి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిందన్నారు. గురువారం నెల్లూరు టౌన్‌హాలు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీడా రవిచంద్ర, నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ల చేతుల మీదుగా బంగారు పతకం, నగదు బహుమతి అందుకున్నట్టు తెలిపారు. 5వ తరగతి చదువుతున్న డి.వీరసాయి భార్గవి రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు, 8వ తరగతి విద్యార్థి సీహెచ్‌ హర్షిత్‌ 10వ ర్యాంకు సాధించి, బహుమతులు అందుకున్నారన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను చిన్నారావు, స్కూల్‌ ఉపాధ్యాయులు అభినందించారు.
     

Advertisement
 
Advertisement
 
Advertisement