ముగిసిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు

ముగిసిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు

ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్‌) : ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా సికింద్రాబాద్‌ కేజేఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్ ‘ఎవరిని ఎవరు క్షమించాలి,’ ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ ‘కేవలం మనుషులం,’ ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు ఉషోదయా కళానికేతన్‌ కట్రపాడు ‘గోవు మాలచ్చిమి,’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటిగా ‘గోవు మాలచ్చిమి’ నాటికలో వెంకటలక్ష్మి పాత్రధారి ఎస్‌.అమృతవర్షిణి. ఉత్తమ నటుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటికలో పుణ్యదాసు పాత్రధారి జోగారావు, ఉత్తమ దర్శకుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక దర్శకుడు ఉదయ్‌ భాగవతులు, ఉత్తమ రచనకు ‘కేవలం మనుషులం’ నాటిక రచయిత శిష్టా చంద్రశేఖర్‌, ఉత్తమ సంగీతం బహుమతి ‘గోవు మాలచ్చిమి’ నాటికకు పి.లీలామోహన్‌. ఉత్తమ విలన్‌గా ఒంగోలు జనచైతన్య ‘చేతిరాత’ నాటికలో గోవిందరాజు పాత్రధారి పి. భద్రేశ్వరరావు, ఉత్తమ కారెక్టర్‌ నటుడు ‘కేవలం మనుషులు’ నాటికలో మీర్జా ఆలీఖాన్‌ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్, ఉత్తమ ద్వితీయ నటి ‘చేతిరాత నాటిక’లో దుర్గ పాత్రధారి ఎల్‌.పద్మావతి. ఉత్తమ ద్వితీయ నటుడు ‘గోవు మాలచ్చిమి’ నాటికలో నారాయణ పాత్రధారి చిరుకూటి సాంబశివరావుకు లభించాయి. ‘సప్తపది’ నాటికలో ముకుందం పాత్రధారి ఎ.హరిబాబు, ‘చేతిరాత’ నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి సీహెచ్‌ సుబ్బారావు, ‘కేవలం మనుషులం’ నాటికలో అమల్‌రాయ్‌ పాత్రధారి ఎ.లక్ష్మణశాస్త్రికి జ్యూరీ బహుమతులు లభించాయి. 

నాగిరెడ్డికి ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం

ముగింపు సమావేశంలో ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ అధ్యక్షడు నాగిరెడ్డి సత్యనారాయణకు ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ నాగిరెడ్డి ఈ పరిషత్‌ స్థాపించి 80 ఏళ్ల వయసులో కూడా చేస్తున్న సేవలను కొనియాడారు. పరిషత్‌ ఉపా«ధ్యక్షుడు వైఎన్‌వీవీ సత్యనారాయణ (కొండ), కార్యదర్శి, సినీనటి వై.సరోజ, పరిషత్‌ కోశాధికారి అయినవిల్లి సతీష్, సంయుక్త కార్యదర్శి వేమవరపు రాంబాబు, పరిషత్‌ ఆర్గనైజర్‌ నాగిరెడ్డి సతీష్‌రావు, పరిషత్‌ సభ్యులు మాకినీడి రామారావు, ఉంగరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనను చిక్కాల సత్కరించారు. పెద్దిరెడ్డి సూరిబాబు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు స్టాలిన్‌, చింతపల్లి వీరభద్రరావు, చింతపల్లి ఈశ్వరరావు కాజులూరు ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, ఆళ్ల రాంబాబు, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మీర్జాఖాసిం హుస్సేన్‌, కోటిపల్లి అబ్బు తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top