పోకిరీని తరిమి తరిమి కొట్టారు.. | stalker was beaten by women in badwelu | Sakshi
Sakshi News home page

పోకిరీని తరిమి తరిమి కొట్టారు..

Jan 25 2016 11:30 AM | Updated on Sep 3 2017 4:18 PM

పోకిరీని తరిమి తరిమి కొట్టారు..

పోకిరీని తరిమి తరిమి కొట్టారు..

గతకొంతకాలంగా అసభ్య పదజాలంతో వేధిస్తున్న ఓ పోకిరీకి మహిళలు తగిన బుద్ధి చెప్పారు. ఫోన్‌లో తరచూ వేధిస్తున్న అతన్ని చితకబాదారు.

వైఎస్‌ఆర్ జిల్లా: గతకొంతకాలంగా అసభ్య పదజాలంతో వేధిస్తున్న ఓ పోకిరీకి మహిళలు తగిన బుద్ధి చెప్పారు. ఫోన్‌లో తరచూ వేధిస్తున్న అతన్ని చితకబాదడమే కాకుండా.. తరిమితరిమికొట్టారు. వారికి స్థానికులు అండగా నిలువడంతో పోకిరీ తోక మూడిచి పారిపోయాడు. ఈ ఘటన వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలులో ఆదివారం రాత్రి ఘటన జరిగింది.

బద్వేలు పట్టణంలోని కృష్ణదేవ రాయనగర్‌కు చెందిన ఓ యువతిని జకీర్ అనే యువకుడు తరచూ ఫోన్‌ లో వేధిస్తున్నాడు. దీంతో యువతి బంధువులు అతన్ని మార్కెట్‌ యార్డ్‌ కు రప్పించి నిలదీశారు. అయినా అతని తీరు మారకపోవడంతో మహిళలు తిరగబడి అతడిని చితకబాదారు. అతడు కూడా వారిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని రోడ్డు మీద పడేసి.. తీవ్రంగా తన్నారు. దీంతో పోకిరీ పరారయ్యాడు. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరుపుతున్నారు. పోకిరీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement