
భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణ మాస చివరి శుక్రవారం అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
అనంతపురం కల్చరల్: శ్రావణ మాస చివరి శుక్రవారం అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నగరంలోని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండరామాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు ఓబులేసు, ఈవో నాగేంద్రరావు నేతృత్వంలో మహిళలు వ్రతమాచరించారు. హెచ్చెల్సీకాలనీలోని నసనకోట ముత్యాలమ్మ, రామనగర్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు నిర్వమించారు. సాయంత్రం కొత్తూరు ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాతకు బంగారు పుష్పాలతో అర్చన చేశారు. రాత్రి ఊంజల సేవ నిర్వహించారు. రామనగర్‌లోని వేంకటేశ్వరాలయంలోనూ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి.