టీడీపీ, బీజేపీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌ను పచ్చిగా మోసం చేయటాన్ని నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా, నగర కాంగ్రెస్ అధ్వర్యంలో శనివారం హిందూ కళాశాల సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు .
ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం
Jul 30 2016 7:26 PM | Updated on Mar 18 2019 9:02 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు
ఆనందపేట: టీడీపీ, బీజేపీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌ను పచ్చిగా మోసం చేయటాన్ని నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా, నగర కాంగ్రెస్ అధ్వర్యంలో శనివారం హిందూ కళాశాల సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు . ఈసందర్భంగా మల్లికార్జున రావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలకు ఎంతో ముఖ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు ముత్యాలరావు మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో తిరుపతి సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడి హమీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా 11 రాష్ట్రాలకు చెందిన పార్టీలు మద్దతు తెలిపినా దీనిపై ప్రకటన చేయకపోవటం దారుణం అన్నారు. ఆంధ్రులు అమాయకులు కాదని.., బీజేపీ, టీడీపీలకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు బలిదానానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలి, నాయకులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఈరి రాజశేఖర్, ఎర్రబాబు, మొగిలి శివకుమార్, సవరం రోహిత్, దొంతా సురేష్, మదనమోహన్‌రెడ్డి, చిలుకా రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement