బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలి | Spicy should strive for gold telangana | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలి

Jul 28 2016 12:37 AM | Updated on Sep 4 2017 6:35 AM

బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీ హీరో తల్వార్‌ సుమన్‌ అన్నారు. మండలంలోని లింగాపూర్‌లో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజ లింగంగౌడ్‌తో కలిసి బుధవా రం ఆయన మెుక్కలు నాటారు. విస్తృతంగా చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాల న్నా రు. విద్యుత్‌ను, నీటిని వృథా చేయవద్దన్నారు.

మద్దూరు : బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీ హీరో తల్వార్‌ సుమన్‌ అన్నారు. మండలంలోని లింగాపూర్‌లో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజ లింగంగౌడ్‌తో కలిసి బుధవా రం ఆయన మెుక్కలు నాటారు. విస్తృతంగా చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాల న్నారు. విద్యుత్‌ను, నీటిని వృథా చేయవద్దన్నారు. కార్యక్రమంలో లింగాపూర్, ధూల్మిట్ట సర్పంచ్‌లు సర్పంచ్‌ సందిటి లక్ష్మి, నాచగోని పద్మ, ఎస్సై తిరుపతి, ఏఎస్సై విల్సన్‌పాల్గొన్నారు.
 
తల్లిదండ్రుల సేవలు మరువద్దు..
తల్లిదండ్రుల సేవలను మరువకూడదని సుమన్‌గౌడ్‌ అన్నారు. లింగాపూర్‌లో నలగొప్పుల సాయన్నగౌడ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రిటైర్డ్‌ ఎంఈఓ నలగొప్పుల సాయన్నగౌడ్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నలగొప్పుల శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ పలువురికి సేవలు అందిస్తున్న సాయన్నగౌడ్‌ కుమారులను అభినందించారు. అనంతరం మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విధ్యార్థులకు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సాయన్నగౌడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నలగొప్పుల రాజుగౌడ్, ట్రస్ట్‌ గౌరవాధ్యక్షురాలు లక్ష్మి, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల వజ్రంగౌడ్, ఉపసర్పంచ్‌ కోరండ్ల రామయ్య, కాంగ్రెస్, టీడీపీ మండలాధ్యక్షులు బండి చంద్రయ్య, ఆకుల ప్రభాకర్, సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, ట్రస్ట్‌ సభ్యులు టీ.వీ.నారామణ, స్వర్గం లక్ష్మయ్య, సింగబట్టు రామరాజు, కనుకయ్య, అయిలయ్య పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement