చదవలేక చావు కోరింది! | Sought death can not read! | Sakshi
Sakshi News home page

చదవలేక చావు కోరింది!

Aug 4 2016 11:53 AM | Updated on Sep 4 2017 7:40 AM

చదవలేక చావు కోరింది!

చదవలేక చావు కోరింది!

కాలేజీకి వెళ్లి చదుకోవాలని తల్లిదండ్రులు చెప్పినందుకు పురుగులు మందు తాగి ఇంటర్‌ విద్యార్థిని లావణ్యేశ్వరి (16) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

పుట్లూరు: కాలేజీకి వెళ్లి చదుకోవాలని తల్లిదండ్రులు చెప్పినందుకు పురుగులు మందు తాగి ఇంటర్‌ విద్యార్థిని లావణ్యేశ్వరి (16) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన హనుమంతురెడ్డి, లక్ష్మిదేవిల కుమార్తె లావణ్యేశ్వరి తాడిపత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

రంజాన్‌ పండుగ సెలవులకు ఇంటికి వచ్చిన లావణ్యేశ్వరి కాలేజీకి వెళ్లనని, తనకు ఎంపీసీ చదవడం కష్టంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. తన కూతురును ఉన్నత చదువులు చదివించాలని భావించిన తల్లిదండ్రులు ఎంపీసీకి బదులుగా నీకు ఇష్టం ఉన్న గ్రూపు తీసుకొవాలని సూచించారు. అయితే కాలేజీకి వెళ్లడం ఇష్టం లేని విద్యార్థినీ ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement