కాసోజు శ్రీకాంతచారి 29వ జయంతి వేడుకలను సోమవారం ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా జరిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి 29వ జయంతి వేడుకలను సోమవారం ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా జరిపారు. స్వర్ణకార సంఘం రాష్ట్ర కోశాధికారి వింజమూరి రాఘవాచారి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్‌స్ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అద్యక్షుడు లాలుకోట వెంకటాచారి, ప్రధానకార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి, స్వర్ణకార సంఘం రాష్ట్ర అద్యక్షుడు జగధీశ్వరాచారి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి ఎల్‌బీనగర్ రింగ్‌రోడ్డులోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేణుగోపాల్, అనంతాచారి పాల్గొన్నారు. చైతన్యపురిలోని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు కాచం సత్యనారాయణ శ్రీకాంతా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు.


