breaking news
srikantachari
-
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి కెప్టెన్.ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నిజంగా తెలంగాణకు బీజేపీ చేసిందేదైనా ఉంటే ఫలానా పనిచేశానని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతోపాటు హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. గాం«దీభవన్‌లో గురువారం ఉత్తమ్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్‌మున్షీలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకరమ్మతో కలిసి ఉత్తమ్ మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చాలా కాలం బీఆర్ఎస్లో పనిచేసినా ఆమెకు న్యాయం చేయలేదన్నారు. తనపై శంకరమ్మ పోటీ చేసినా, ఎప్పుడూ తాము వ్యక్తిగత వైరాలకు వెళ్లలేదని, శంకరమ్మ చేరికతో హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యిందని చెప్పారు.లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలవాలని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు కాగానే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని, అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 చోట్ల గెలుపొందుతుందని, 3 చోట్ల బీజేపీతో, ఒక చోట ఎంఐఎంతో కాంగ్రెస్‌కు పోటీ ఉందన్నారు. నాకు అన్యాయం జరిగింది: శంకరమ్మ శంకరమ్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తమకు అన్యాయం జరిగిందని చెప్పారు. శ్రీకాంతాచారి మరణం చూసిన సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆమె కోరారు. -
శ్రీకాంతచారికి ఘననివాళులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి 29వ జయంతి వేడుకలను సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా జరిపారు. స్వర్ణకార సంఘం రాష్ట్ర కోశాధికారి వింజమూరి రాఘవాచారి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్స్ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అద్యక్షుడు లాలుకోట వెంకటాచారి, ప్రధానకార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి, స్వర్ణకార సంఘం రాష్ట్ర అద్యక్షుడు జగధీశ్వరాచారి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేణుగోపాల్, అనంతాచారి పాల్గొన్నారు. చైతన్యపురిలోని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు కాచం సత్యనారాయణ శ్రీకాంతా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు.