సొసైటీలు పారదర్శకంగా పనిచేయాలి | Societies should work efficiently | Sakshi
Sakshi News home page

సొసైటీలు పారదర్శకంగా పనిచేయాలి

Nov 4 2016 1:03 AM | Updated on Oct 20 2018 6:19 PM

సొసైటీలు పారదర్శకంగా పనిచేయాలి - Sakshi

సొసైటీలు పారదర్శకంగా పనిచేయాలి

నెల్లూరు రూరల్‌ : గ్రామ స్థాయిలో ప్రాథమిక పరపతి సంఘాలు(సొసైటీలు) పారదర్శకమైన సేవలు అందించాలని జిల్లా సహకార అధికారి రాజేశ్వరరావు సొసైటీల ముఖ్య కార్యనిర్వాహణ అధికారులకు సూచించారు.

  •  జిల్లా సహకార అధికారి రాజేశ్వరరావు 
  • నెల్లూరు రూరల్‌ : గ్రామ స్థాయిలో ప్రాథమిక పరపతి సంఘాలు(సొసైటీలు) పారదర్శకమైన సేవలు అందించాలని జిల్లా సహకార అధికారి రాజేశ్వరరావు సొసైటీల ముఖ్య కార్యనిర్వాహణ అధికారులకు సూచించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో క్రిభ్‌కో ఆధ్వర్యంలో నిఘా అవగాహణ వారోత్సవాలను గురువారం నిర్వహించారు. డీసీఓ మాట్లాడారు. రైతులకు అవినీతి రహిత సేవలు అందించాలన్నారు. గ్రామాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు. విజిలెన్స్‌ డీఎస్పీ వెంకటనా«ద్‌రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులకు సకాలంలో ఎరువులు అందజేస్తూ, స్టాకు, క్రయ, విక్రయాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు చేరకుండా సొసైటీలు సహకరించాలన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రతి వ్యవస్థలో నిఘా విభాగాన్ని పటిష్టంగా పనిచేయాలన్నారు. క్రిభ్‌కో సీనియర్‌ మేనేజర్‌ సాంబశివారెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో ఎరువుల కర్మాగారం నిర్మిస్తున్నట్లు చెప్పారు. డీలర్లు, సహకార సంఘాలు ఎరువులను రైతులకు సకాలంలో అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంకు సీఈఓ రాజారెడ్డి, డీఎల్‌సీఓ తిరుపాల్‌రెడ్డి, శరభయ్య, డీసీఎంఎస్‌ మేనేజర్‌ సుధాభారతి, విజిలెన్స్‌ ఏఓ ధనుంజయరెడ్డి, క్రిభ్‌కో డిప్యూటీ మేనేజర్‌ రియాజ్‌ అహ్మద్, పీఏసీఎస్‌ సీఈఓలు, తదితరులు పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement