అణగారిన పేద వర్గాలను అణచి వేస్తోంది | social rights round table meeting in hindupur | Sakshi
Sakshi News home page

అణగారిన పేద వర్గాలను అణచి వేస్తోంది

Sep 3 2016 11:05 PM | Updated on Sep 4 2017 12:09 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ వర్గాలకు కొమ్ము కాస్తూ అణగారిన పేద వర్గాలను అణచి వేస్తోందని సామాజిక హక్కుల వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు.

హిందూపురం టౌన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ వర్గాలకు కొమ్ము కాస్తూ అణగారిన పేద వర్గాలను అణచి వేస్తోందని సామాజిక హక్కుల వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సామాజిక హక్కుల వేదిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక ఐఎంఏ హాలులో జిల్లా, రాష్ట్ర స్థాయి వివిధ కుల సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనాభాలో అధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు లేక, ప్రభుత్వ తోడ్పాటు లేక అణచివేతకు గురవుతున్నారన్నారు.

అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ప్రభుత్వమే భూములు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈ నెల 17న అనంతపురంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో సామాజిక హక్కుల వేదిక కన్వీనర్‌ జగదీష్, జాతీయ వడ్డెర సంఘం నాయకులు జయంత్, ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మధు, ఆర్పీఎస్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీరాములు, ఓపీడీఆర్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, మైనార్టీ రాష్ట్ర నాయకులు నదీమ్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు నాగభూషణం, నూర్‌మహ్మద్, సాలార్‌బాషా, వేదిక సభ్యులు జాఫర్, కాటమయ్య, ఆనంద్‌కుమార్, శ్రీరాములు, కష్ణానాయక్, సురేష్, దాదాపీర్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement