చికిత్సపొందుతూ విద్యార్థి మృతి | snake bitten student died | Sakshi
Sakshi News home page

చికిత్సపొందుతూ విద్యార్థి మృతి

Jul 19 2016 9:44 PM | Updated on Nov 9 2018 4:36 PM

పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన టేక్మాల్‌ మండలం ఎలకుర్తిలో మంగళవారం చోటుచేసుకుంది.

టేక్మాల్‌: పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన టేక్మాల్‌ మండలం ఎలకుర్తిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ లింగస్వామి కథనం ప్రకారం... పాపన్నపేట మండ లం గాంధారిపల్లికి చెందిన కాసాల వెంకట్‌రెడ్డి విజయలక్ష్మి దంపతుల కుమారుడు లక్ష్మారెడ్డి(13) ఈనెల ఒకటిన టేక్మాల్‌ మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చాడు.

పరీక్ష ముగించుకొని మామ అయిన ఎలకుర్తి గ్రామానికి చెందిన బాపురెడ్డి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న లక్ష్మారెడ్డి ఈనెల 13న చేతులు, కాళ్లు గుంజుతున్నాయని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని మెదక్‌ ఆస్పత్రికి తరలించగా పాముకాటు వేసినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. అదేరోజు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement