
భారీగా ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రకూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రకూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం చెర్లోపల్లి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రకూలీలు రాళ్లదాడికి దిగారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుమారు రూ.2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రాళ్లతో దాడికి పాల్పడిన ఎర్రకూలీలు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.