breaking news
red sandlewood
-
అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న దొంగల ముఠా అరెస్ట్
-
భారీగా ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రకూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం చెర్లోపల్లి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రకూలీలు రాళ్లదాడికి దిగారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుమారు రూ.2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రాళ్లతో దాడికి పాల్పడిన ఎర్రకూలీలు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
-
30 మంది ఎర్రచందనం కూలీల పరారీ
తిరుపతి క్రైమ్: శేషాచలం అడవుల్లో కూంబింగ్ జరుపుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు మరోసారి తమిళ కూలీలు ఎదురుపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి తిరుపతి పట్టణ సమీపంలోని చైతన్యాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరిపారు. పోలీసులను చూసి 30 మందికిపైగా తమిళ కూలీలు పరారయ్యారు. చిన్నప్ప అనే తమిళనాడులోని వేలూరు ప్రాంతానికి చెందిన కూలీ మాత్రం పట్టుబడ్డాడు. 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారైన కూలీల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలపై కాల్పులు
తిరుపతి క్రైమ్: శేషాచలం అడవుల్లో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఈతగుంట ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై మంగళవారం రాత్రి సుమారు 100 మంది ఎర్రచందనం కూలీలు దాడికి యత్నించారు. రాళ్లు రువ్వి దాడికి యత్నించడంతో మూడు బృందాలుగా ఉన్న (ఒక్కో బృందంలో 17 మంది) టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూలీలపై కాల్పులు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు టన్నుల ఎర్ర చందనం స్వాధీనం
శ్రీకాకుళం: పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలు కనిపించాయి. ఈ ఘటన శనివారం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని అర్చనాపురంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే ఓ ఇంట్లో రెండు టన్నుల ఎర్ర చందనం దుంగలను పోలీసులు గుర్తించారు. సదరు ఇంటి యాజమానిపై కేసు నమోదు చేసి దుంగలను సీజ్ చేశారు. -
పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్
-
స్వాతంత్య్రానికి పూర్వమే అటవీ హత్యలు
సాక్షి ప్రతినిధి, కడప: అటవీ హత్యలు ఈనాటివి కావు. స్వాతంత్య్రం రాకముందు కూడా ఇలాంటి హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. అడవులను కాపాడుకోవాలనే దృక్పథాన్ని విడనాడి ప్రకృతి సంపద ద్వారా అక్రమార్జన చేయడానికి కొందరు అలవాటుపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిత్తూరు జిల్లాలో అటవీ సిబ్బందిని స్మగ్లర్లు కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. అలాంటి ఘటన 1939లోనే వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. స్మగ్లర్లతో పాటు క్రూరమృగాల నుంచి తప్పించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలన్న అటవీ సిబ్బంది విన్నపాన్ని పాలకులు 8 దశాబ్దాలుగా పెడచెవిన పెడుతున్నారు. 1939లోనే మూడు హత్యలు... చిట్వేలి మండలం తిమ్మయ్యగారిపల్లెలో 1939 మార్చి 17న ముగ్గురు అటవీ సిబ్బంది హత్యకు గురయ్యారు. అటవీ సంపదను తెగనరకవద్దని అన్నందుకే వీరు ప్రాణాలు కోల్పోయారు. తిమ్మయ్యగారిపల్లెకు చెందిన కేశవులు, సోమయ్య, పెంచలు అనే ముగ్గురు అక్కడి ఫారెస్టు సంరక్షకులుగా ఉండేవారు. వంట చెరకు, ఇంటి సామగ్రి కోసం అడవిని స్థానికులు నిత్యం ధ్వంసం చేస్తుండేవారు. కటారి పాపయ్య అనే వ్యక్తి అడవిని కొల్లగొడుతుండటంతో కేశవులు పరుషంగా మాట్లాడారు. దీంతో కోపోద్రిక్తుడైన కటారి పాపయ్య ముగ్గురిని హత్యచేసి మృతదేహాలను అడవిలో పారేశాడు. ఈ కేసుకు సంబంధించి కటారిపాపయ్యకు మరణశిక్ష విధించగా తన పలుకుబడితో యావజ్జీవ శిక్షకు పరిమితం చేసుకున్నాడు. అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అప్పటి సిబ్బంది గుర్తుగా స్మారకస్థూపం ఏర్పాటైంది. ఆ నాటి నుంచి ఆ ప్రాంతాన్ని కేశవుల బండ అని పిలుస్తున్నారు. పునరావృతం అవుతున్న ఘటనలు.... అక్రమార్జనకు ఎర్రచందనం ఆర్థిక వనరుగా మారడంతో తరుచూ అటవీ యంత్రాంగ ంపై దాడులు జరుగుతున్నాయి. జిల్లాలో 2010లో పుల్లలమడుగు బీట్‌లో అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు కాల్పులు జరిపారు. సుండుపల్లె సమీపంలో అటవీ సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు చేశారు. కడప సమీపంలోని పాలకొండల్లో ఓబులేసు అనే బీట్ ఆఫీసర్‌పై దాడి చేశారు. మైదుకూరు సెక్షన్ పరిధిలో వరుస దాడులు జరిగాయి. అంతరించిపోతున్న ఎర్రచందనాన్ని రక్షించాలంటే అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరమని ఉన్నతాధికారులు పలుమార్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కడప, చిత్తూరు, కర్నూలు అటవీ సిబ్బందికి 400 తుపాకులు అవసరమని నివేదికలు సమర్పించారు. ఆ నివేదికలు బుట్టదాఖలయ్యాయి. దీంతో ఎర్రచ ందనం స్మగ్లర్లకు ఇష్టారాజ్యమైంది. అనతి కాలంలోనే కోటీశ్వర్లుగా చ లామణి అవుతుండటంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పాలకుల అండతోనే.. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లుగా ఉంది. అధికారంలో ఉన్న పాలకుల అండదండలతో స్మగ్లర్లు చెలరేగిపోతున్నట్లు పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన గజ్జల శ్రీనివాసులరెడ్డిపై వైఎస్సార్ జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు ఏడు కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డితో శ్రీనివాసులరెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవాడు. ‘గజ్జ గల్లు- అడవి ఘెల్లు’ అంటూ గత ఏడాది సాక్షి కథనం కూడా ప్రచురించింది. గజ్జల శ్రీనివాసులరెడ్డి అలియాస్ శ్రీనురెడ్డి కొన్నేళ్ల క్రితం కోర్టులో లొంగిపోయాడు. అప్పట్లో అటవీ యంత్రాంగం శ్రీనురెడ్డిపై పీడీ యాక్టు అమలు చేసింది. కొంత కాలం జైలు జీవితం గడిపిన శ్రీనురెడ్డి చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా బయటికొచ్చాడు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా శ్రీను రెడ్డి పత్రికలలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇలాంటి స్మగ్లర్లను అడ్డుకునే సాహసం ఎవరు చేస్తారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ హత్యలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలకు ఇటువంటి ఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు.