పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలు కనిపించాయి.
శ్రీకాకుళం: పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలు కనిపించాయి. ఈ ఘటన శనివారం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని అర్చనాపురంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే ఓ ఇంట్లో రెండు టన్నుల ఎర్ర చందనం దుంగలను పోలీసులు గుర్తించారు. సదరు ఇంటి యాజమానిపై కేసు నమోదు చేసి దుంగలను సీజ్ చేశారు.