వడదెబ్బతో ఆరుగురి మృతి | six died in pulivendula over sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఆరుగురి మృతి

May 11 2016 4:04 PM | Updated on Nov 6 2018 4:38 PM

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం వడదెబ్బతో ఆరుగురు మృతి చెందారు.

పులివెందుల: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం వడదెబ్బతో ఆరుగురు మృతి చెందారు. పుల్లంపేట మండలం శ్రీరాములుపేటకు చెందిన ఎస్.జయమ్మ (79),పెనగలూరు మండలం దిగువసిద్దవరం గ్రామానికి చెందిన కరణం చెంగమ్మ (65), పెనగలూరు పంచాయతి ఇండ్లూరు గ్రామానికి చెందిన రాచూరి పెంచలయ్య (64),ముద్దనూరు మండ లం తిమ్మాపురం గ్రామంలో తాటి గంగన్న(59) మృతిచెందారు.

అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ పరిధిలోని పాటిమీదపల్లికి చెందిన బాలవీరయ్య(55), పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం కాలనీకి చెందిన బయన్న(50) వడదెబ్బ కారణంగా మృతి చెందారు. వడదెబ్బతో మృతి చెందిన వృద్ధుడిని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు అంబకపల్లె బాబురెడ్డితోపాటు పలువురు నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement