‘నంది’ స్థానంలో సింహ అవార్డులు | Simha Awards replace nandhi awards | Sakshi
Sakshi News home page

‘నంది’ స్థానంలో సింహ అవార్డులు

Dec 9 2016 6:11 AM | Updated on Sep 4 2017 10:14 PM

‘నంది’ స్థానంలో సింహ అవార్డులు

‘నంది’ స్థానంలో సింహ అవార్డులు

రాష్ట్రంలో నిర్మించే ఉత్తమ చలన చిత్రాలకు, అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించే కళాకారులకు ‘సింహ’ పురస్కారాలు

ఉత్తమ సినీ కళాకారుడికిఎన్టీఆర్‌ జాతీయ అవార్డు
రాష్ట్రంలో నిర్మించిన ఉత్తమ చిత్రాలు,
కళాకారులకు తెలంగాణ పురస్కారాలు
ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మించే ఉత్తమ చలన చిత్రాలకు, అత్యుత్తమ ప్రతిభను ప్రద ర్శించే కళాకారులకు ‘సింహ’ పురస్కారాలు ఇవ్వాలని రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చలన చిత్ర పురస్కారాలను ‘నంది’ పేరుతో అందజేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో ఈ పురస్కారాలను ఏ విధంగా అందజేయాలనే దానిపై ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది.

మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఈ కమిటీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు తమ ప్రతిపాదనలను అందజేసింది. పురస్కారాలు ‘సింహం’ రూపంలో ఉండాలని.. మొత్తం నలభై విభాగాల్లో వీటిని అందజేయాలని కమిటీ సూచించింది. మొదటి విభాగంలో పురస్కారాలకు రూ.5 లక్షల చొప్పున నగదు పారితోషికం ఇవ్వాలని పేర్కొంది. తెలంగాణ ముద్ర చాటేలా చలనచిత్ర పురస్కారాలు ఇవ్వాలని అభిప్రాయపడింది. దీనికి సంబం« దించి సినిమాటోగ్రఫీ శాఖ ఓ ఫైలును సిద్ధం చేసి... గురువారం ముఖ్యమంత్రి కార్యాలయా నికి పంపింది. సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపిన అనంతరం ఉత్తర్వులు వెలువడనున్నాయి.

సినీకళాకారులు, సాంకేతిక నిపుణులకు..
ఉత్తమ దర్శకుడు, కథానాయకుడు, నాయికకు స్వర్ణ సింహాలు, రూ.లక్ష చొప్పున నగదు
ఉత్తమ సహాయ నటుడు, నటికి రూ.50 వేలు, స్వర్ణ సింహాలు
ఉత్తమ హాస్యనటునికి తామ్ర సింహం, రూ.50 వేలు
ఉత్తమ ప్రతినాయకునికి స్వర్ణ సింహం, రూ.50 వేలు
ఉత్తమ బాల నటులకు స్వర్ణ సింహం, రూ. 50 వేలు
తొలి చిత్ర దర్శకుడు, నటుడు, నటికి రూ.50 వేలు, రజత సింహం.
ఉత్తమ కథా రచయిత, మాటలు, పాటల రచయిత, సినిమాటోగ్రాఫర్‌కు స్వర్ణ సింహం, రూ.50 వేల నగదు
ఉత్తమ సంగీత దర్శకుడికి చక్రి పేరిట రూ.50 వేలు, స్వర్ణ సింహం
ఉత్తమ నేపథ్య గాయకుడు, గాయనిలకు రూ.50 వేలు, స్వర్ణసింహాలు
ఉత్తమ ఎడిటర్, కళాదర్శకుడు, నృత్యదర్శకుడు, ఆడియోగ్రాఫర్, కాస్ట్యూమ్‌ డిజైనర్, మేకప్‌ ఆర్టిస్టు, స్టంట్‌ డిజైనర్, డబ్బింగ్‌ కళాకారుడు, కళాకారిణి, విజువల్‌ ఎఫెక్టŠస్, ప్రత్యేక కేటగిరీ పురస్కారాల కింద తామ్ర సింహాలు, రూ. 50 వేలు.

కమిటీ సిఫార్సులివీ..
జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ నటులకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం. రూ.5 లక్షల పారితోషికం, స్వర్ణ సింహం
నటులు కాకుండా ఇతర సినీ ప్రముఖులకు పైడి జయరాజు పేరిట స్వర్ణ సింహం, రూ.5 లక్షలు.
తెలుగు సినీ ప్రముఖులకు రఘుపతి వెంకయ్యపురస్కారం, స్వర్ణసింహం, రూ.5 లక్షలు
తెలంగాణ సినీ ప్రముఖులకు కాంతారావు పురస్కారం, స్వర్ణసింహం, రూ.5లక్షలు

ఉత్తమ చిత్రాలకు
ఉత్తమ చిత్రానికి రూ.5 లక్షలు, నిర్మాతకు స్వర్ణ సింహం; దర్శకుడు, హీరో, హీరోయిన్లకు సింహ పురస్కారాలు
ద్వితీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు రజత సింహం, రూ.3 లక్షలు; దర్శకుడు, హీరో, హీరోయిన్లకు పురస్కారాలు
తృతీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు కాంస్య సింహం, రూ.2 లక్షలు; దర్శకుడు, హీరో, హీరోయిన్లకు పురస్కారాలు
ఉత్తమ కుటుంబ చిత్రానికి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పురస్కారం. నిర్మాతకు స్వర్ణ సింహం, రూ.2 లక్షల నగదు
ఉత్తమ వినోదాత్మక చిత్రానికి స్వర్ణ సింహం, రూ.2 లక్షల నగదు
జాతీయ సమగ్రతను చాటే చిత్రానికి సరోజినీనాయుడు పురస్కారం. నిర్మాతకు రూ.2 లక్షల నగదు, స్వర్ణసింహం; దర్శకుడికి తామ్ర పురస్కారం
ఉత్తమ బాలల చిత్ర నిర్మాతకు స్వర్ణ సింహం, రూ.2 లక్షల నగదు; దర్శకుడికి రూ.లక్ష, తామ్ర సింహం
ద్వితీయ ఉత్తమ బాలల చిత్ర నిర్మాతకు రూ.లక్ష, రజత సింహం; దర్శకుడికి రూ.50 వేలు
బాలల చిత్ర విభాగంలో ఉత్తమ దర్శకుడికి రూ.లక్ష, స్వర్ణ సింహం
తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథానికి రూ.50 వేలు, తామ్ర సింహం
తెలుగు సినిమాపై ఉత్తమ విమర్శకుడికి రూ.30 వేలు,తామ్ర సింహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement