గడువులోగా పూర్తి చేయాలి | should be done to meet the deadlineS | Sakshi
Sakshi News home page

గడువులోగా పూర్తి చేయాలి

Jul 29 2016 1:14 AM | Updated on Sep 4 2017 6:46 AM

గడువులోగా పూర్తి చేయాలి

గడువులోగా పూర్తి చేయాలి

నాగార్జునసాగర్‌ : గడువులోగా పుష్కర పనులు పూర్తి చేయాలని, లేనట్లయితే సదరు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.

నాగార్జునసాగర్‌ : గడువులోగా పుష్కర పనులు పూర్తి చేయాలని, లేనట్లయితే సదరు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం పెద్దవూర మండలంతో పాటు సాగర్‌లో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను సందర్శించారు. సాగర్‌లో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి అక్కడ లేకుండా పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికైనా పనులు పూర్తి కాకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఘాట్లతో పాటు తాగునీరు, విద్యుత్, శానిటరీ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఎస్‌ఈకి సూచించారు. ఆయన వెంట ఈఈ విష్ణుప్రసాద్,ఏఈ వెంకటేశ్వర్లు, డీఈ విజయకుమార్, జేఈ జనార్దన్, తహశిల్దార్‌ పాండునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement