రచ్చకెక్కిన ‘షాడే’ స్థలం లీజు వ్యవహారం

రచ్చకెక్కిన ‘షాడే’ స్థలం లీజు వ్యవహారం

ఫెన్సింగ్‌ను కూల్చేసిన ఆందోళనకారులు

 17 మందిరి అరెస్టు చేసిన పోలీసులు

రాజమహేంద్రవరం క్రైం/దానవాయి పేట : షాడే స్కూల్‌ భూముల లీజ్‌ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఈ భూముల్లో గుంటూరుకు చెందిన గ్రంధి విజయలక్ష్మి అనే మహిళకు మూడు ఏకరాలు లీజుకు ఇస్తూ ఏఈఎల్‌సీ చేసిన తీర్మానం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాల జేఏసీ నాయకులు గెడ్డం నెల్సన్‌బాబు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు, ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు కాశీ నవీన్‌కుమార్, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు వైరాల అప్పారావు తదితరులు దీనిని వ్యతిరేకిస్తూ, ఆయా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. భూమి ఫెన్సింగ్‌ను కూలగొట్టారు. ఈ క్రమంలో పోలీసు బలగాలు సంఘటన స్థలాన్ని మోహరించాయి. త్రీటౌన్‌ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు, వన్‌టౌన్‌ సీఐ రవీంద్రలు ఆందోళనకారులతో చర్చించారు. లీజుకు చట్టబద్ధత ఉందని, దానిని కోర్టులో తేల్చుకోవాలని ఆందోళనకారులకు సూచించారు. అనంతరం ఆందోళన చేపట్టిన గెడ్డం నెల్సన్‌బాబు, బర్రే కొండబాబు, నవీన్‌కుమార్, అప్పారావు సహా 17 మందిని అరెస్టు చేశారు. అనంతరం‡స్టేçÙన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top