రామకృష్ణారావుకు సేవాభారతి పురస్కారం | seva bharati award to Ramakrishna Rao | Sakshi
Sakshi News home page

రామకృష్ణారావుకు సేవాభారతి పురస్కారం

Aug 25 2016 6:10 PM | Updated on Mar 28 2018 11:26 AM

రామకృష్ణారావుకు సేవాభారతి పురస్కారం - Sakshi

రామకృష్ణారావుకు సేవాభారతి పురస్కారం

పలు సామాజిక, విద్యాసంబంధమైన సేవా కార్యక్రమాలను చేసినందుకు చేవెళ్లకు చెందిన ఉపాద్యాయుడు పి.రామకృష్ణారావుకు శిఖరం ఆర్ట్‌ అసోసియేషన్‌ పురస్కారాన్ని అందజేసింది.

చేవెళ్ల రూరల్‌: పలు సామాజిక, విద్యాసంబంధమైన సేవా కార్యక్రమాలను చేసినందుకు చేవెళ్లకు చెందిన ఉపాద్యాయుడు పి.రామకృష్ణారావుకు శిఖరం ఆర్ట్‌ అసోసియేషన్‌ పురస్కారాన్ని అందజేసింది. ఈ అవార్డును బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, మల్లాది చంద్రమౌళిల నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు గురువారం చేవెళ్లలో విలేకరులతో మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసిన పెద్దలకు, శిఖరం అర్ట్‌ థియేటర్స్‌ అసోసియేషకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ పురస్కారం అందించి మరింత బాధ్యతను పెంచినట్లు చెప్పారు. అవార్డు కార్యక్రమంలో శిఖరం అర్ట్‌ థియేటర్స్‌ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, కాచం సత్యనారాణగుప్త తదితరులు పాల్గొన్నారని రామకృష్ణారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement