జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపికకు ప్రతిపాదనలు | Selection of the best teachers in the district of award nominations | Sakshi
Sakshi News home page

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపికకు ప్రతిపాదనలు

Aug 5 2016 12:14 AM | Updated on Sep 4 2017 7:50 AM

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక –2016 కోసం ప్రతిపాదనలు సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారుల ద్వారా పంపాలని డీఈఓ పి.రాజీవ్‌ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక –2016 కోసం ప్రతిపాదనలు సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారుల ద్వారా పంపాలని డీఈఓ పి.రాజీవ్‌ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 
డాక్ట ర్‌ సర్వేపెల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఈ అవార్డుల ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు 10సంవత్సరాలు పూర్తి సర్వీస్‌ కలిగి ఉండాలని, బడిబాటలో విద్యార్థులను ఎన్‌రోల్‌మెంట్‌ చేసి ఉండాలని, అలాగే హరితహారంలో భాగస్వాములై ఉండాలని తెలిపారు. అలాగే క్రిమినల్‌ కేసులు ఉండరాదని, ఇప్పటికే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారు తిరిగి ప్రతిపాదనలు చేయెుద్దని డీఈఓ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement