గుట్టు చప్పుడు కాకుండా లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పరీక్ష | secret examination | Sakshi
Sakshi News home page

గుట్టు చప్పుడు కాకుండా లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పరీక్ష

Sep 4 2016 10:12 PM | Updated on Sep 26 2018 3:23 PM

భూమి రికార్డులు, సర్వే విభాగ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పరీక్ష నిర్వహించారు.

 కర్నూలు (అగ్రికల్చర్‌): భూమి రికార్డులు, సర్వే విభాగ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పరీక్ష నిర్వహించారు. ఆదివారం కర్నూలు సమీపంలోని డీఆర్‌డీఏ శిక్షణా కేంద్రంలో 53 మంది లైసెన్స్‌డే సర్వేయర్లకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు, అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున మామూళ్లు వసూలు చేసినట్లు  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా బయటికి పొక్కకుండా గోప్యంగా పరీక్షలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కూడా ఓసారి గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement