పాఠశాలల బలోపేతమే లక్ష్యం | Schools aim to strengthen | Sakshi
Sakshi News home page

పాఠశాలల బలోపేతమే లక్ష్యం

Aug 30 2016 11:34 PM | Updated on Sep 4 2017 11:35 AM

డిజటల్‌ టీవీని అందజేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత

డిజటల్‌ టీవీని అందజేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత అన్నారు.

  • జెడ్పీచైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత
  • ముసలిమడుగు(వైరా) : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత అన్నారు. మంగళవారం మండల పరి«ధిలోని ముసలిమడుగు గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ పౌండేషన్‌ పేరెంట్‌ అసోసియెషన్‌ కమిటీ సభ్యుడు కొండబోలు రవి, బెల్లం మధుచౌదరి, కిషన్‌ స్వరూప్‌లు పాఠశాలకు డిజటల్‌ టీవీని అందజేశారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డిజటల్‌ తరగతులు నిర్వహించటంవల్ల విద్యార్థులకు బోధనలో ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం తరగతులు ప్రవేశపెట్టిందని, త్వరలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ పౌండేషన్‌ సభ్యులను అభినందించారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ సభ్యురాలు బొర్రా ఉమాదేవి, ఎంపీపీ బొంతు సమత, సర్పంచ్‌ చింతనిప్పు కరుణాకర్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ చిర్రా సుజాత, నాయకులు బొర్రా రాజ శేఖర్, సూతకాని జైపాల్, కృష్ణార్జునరావు, హెచ్‌ఎం వెంకటేశ్వరరావు తదితరులున్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement