
జిల్లాకు వెలుగునివ్వండి
స్త్రీలు స్వయం ప్రకాశులుగా మారి జిల్లాకు వెలుగునివ్వాలని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.
–ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ విజయ్‌కుమార్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : స్త్రీలు స్వయం ప్రకాశులుగా మారి జిల్లాకు వెలుగునివ్వాలని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతీ మహిళా సంఘంలో రుణాలు తీసుకునఆనవారు తిరిగి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సంఘంలో లేని వారిని గుర్తించి వారితో కొత్త సంఘాలను ఏర్పాటు చేయించాలన్నారు. జిల్లాలో 411 బ్యాంకులు ఉన్నాయని తెలిపారు.
వాటి ద్వారా రూ.411 కోట్ల రుణాలను పొందవవచ్చున్నారు. 822 ఎస్సీ, ఎస్టీలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. జిల్లా కోన శశిధర్ మాట్లాడుతూ స్త్రీలను చైతన్య పరిచేవిధంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఎస్సీలకు భూమిని అందించేందుకు తగిన సహాయాన్ని అందించాలని ఎండీని కోరారు. కుటుంబ ఆదాయం పెరుగుదలకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలలో ఎస్సీల కోసం 15 శాతం నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడిచిన 18 ఏళ్లలో 13 సంవత్సరాలుగా జిల్లాను కరువు పట్టిపీడిస్తోందన్నారు. హంద్రి నీవా నీరు లేకపోతే మరింత ఇబ్బంది ఎదురయ్యేదని చెప్పారు.
జియో ట్యాగింగ్‌ను పకడ్బందీగా చేయాలి
ఓబీఎమ్‌ఎమ్‌ఎస్ ద్వారా అప్‌లోడ్ అయిన రుణ దరఖాస్తులను జియో ట్యాగింగ్ ద్వారా పకడ్బందీగా చేయాలని ఎండీ విజయకుమార్ ఎంపీడీఓలకు సూచించారు. బ్యాంకర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి దరఖాస్తుఽను నిశితంగా పరిశీలించాలన్నారు. జియో–ట్యాగింగ్ పై అ«ధికారులకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.