వైభవంగా త్రిశూలేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు | Sasti Celebrations | Sakshi
Sakshi News home page

వైభవంగా త్రిశూలేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు

Dec 13 2016 10:57 PM | Updated on Sep 4 2017 10:38 PM

వైభవంగా త్రిశూలేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు

వైభవంగా త్రిశూలేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు

సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు.

ముదినేపల్లి రూరల్‌ : సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటి వీరభద్రశర్మ ఆధ్వర్యంలో త్రిశూలేశ్వర స్నపనం, అపభృత స్నానం జరిపించారు. స్వామి, అమ్మవార్ల  ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఏసీ ఎం.శారదాకుమారి, చైర్మన్‌ పరసా విశ్వేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌ మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తూరి విఠల్, రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు చలసాని జగన్మోహనరావు, మాజీ ఎంపీపీ వీరమల్లు నరసింహారావు పాల్గొన్నారు. 

Advertisement

పోల్

Advertisement