క్రికెటర్‌ భరత్‌వీర్‌కు సత్కారం | sanmanam to cricator barathveer | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ భరత్‌వీర్‌కు సత్కారం

Jul 24 2016 9:45 PM | Updated on Sep 4 2017 6:04 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: దక్షిణాసియాలో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలకు ఎంపికైన ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల భరత్‌వీర్‌యాదవ్‌కు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం రూ. 2 వేలు ఆర్థిక సహాయం అందజేసి శాలువాతో సత్కరించారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: దక్షిణాసియాలో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలకు ఎంపికైన ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల భరత్‌వీర్‌యాదవ్‌కు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం రూ. 2 వేలు ఆర్థిక సహాయం అందజేసి శాలువాతో సత్కరించారు. యువతను ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా రాణిస్తారని చెప్పారు. భరత్‌ తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గంట రాములుయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, మోహన్, శ్రీశైలం, కృష్ణ, నాగరాజు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement