సీఎం తీరుతో సాగర్‌ రైతులకు ఇబ్బందులు | sagar kenal farmers problems | Sakshi
Sakshi News home page

సీఎం తీరుతో సాగర్‌ రైతులకు ఇబ్బందులు

Sep 30 2016 11:51 PM | Updated on Oct 1 2018 2:09 PM

సీఎం తీరుతో సాగర్‌ రైతులకు ఇబ్బందులు - Sakshi

సీఎం తీరుతో సాగర్‌ రైతులకు ఇబ్బందులు

నరసరావుపేట : సీఎం చంద్రబాబు చేతగానితనంతో నాగార్జునసాగర్‌ కుడికాలువ రైతులు సాగు నీటì æకోసం ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

 
నరసరావుపేట : సీఎం చంద్రబాబు చేతగానితనంతో నాగార్జునసాగర్‌ కుడికాలువ రైతులు సాగు నీటì æకోసం ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తెలంగాణ  ప్రభుత్వంతో విభేదాలు, కేసులు, సొంత అజెండాతో కేసీఆర్‌తో మాట్లాడలేకపోవటం ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు. కుడికాలువ ఆయకట్టు రైతులకు రబీ సీజన్‌లోనైనా సాగర్‌ ద్వారా నీరందించాలని కోరారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వర్షాభావంతో మినుము ఎండిపోతే అకాలవర్షాల వలన పత్తి, మిర్చి, కంది పంటలు దెబ్బతిన్నాయన్నారు. 
శ్రీశైలంలో 883 అడుగులకు నీరుచేసి 210 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. శ్రీశైలంలో 846 అడుగుల నీరు వస్తేనే నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయవచ్చని జీవో ఉందన్నారు. చేరిన నీటిలో 70 టీఎంసీలు మంచినీటి కోసం కేటాయించినా ఇంకా 140 టీఎంసీలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇంతటి వెసులుబాటున్నా రైతులకు నీరొచ్చేదీ లేనిది స్పష్టత ఇవ్వకపోవటం బాధాకరమన్నారు.  డెల్టా తర్వాత అంతటి ప్రాధాన్యమున్న సాగర్‌ కుడికాలువ ఆయకట్టు రైతులు చంద్రబాబు తీరుతో నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నా మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబుది అన్నారు.  
నష్ట పరిహారం సక్రమంగా 
ఇవ్వకపోతే ధర్నా చేస్తాం
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పార్టీలు, కులాలు, మతాలకతీతంగా సహాయం చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్‌ చేశారు. లేకపోతే తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. 
జయహో భారత్‌ 
ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారతీయ జవాన్లకు ఆయన అభినందనలు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ సుజాతపాల్, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జీ గాబ్రేల్, పట్టణ అధ్యక్షుడు ఎస్‌ఏ హనీఫ్, జిల్లా కార్యదర్శి కందుల యజ్రా, రొంపిచర్ల మండల అధ్యక్షుడు పచ్చవ రవీంద్ర పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement