చీర సింగారం..నారు సురక్షితం | safe sari singaram | Sakshi
Sakshi News home page

చీర సింగారం..నారు సురక్షితం

Aug 11 2016 12:19 AM | Updated on Sep 4 2017 8:43 AM

బయ్యారంలో మిరపనారు చుట్టూ చీరల వలయం

బయ్యారంలో మిరపనారు చుట్టూ చీరల వలయం

చుట్టూ చీరలు..తడిక మాదిరి చుట్టేశారు. వేలాది రూపాయలు వెచ్చించి మిరప గింజలు కొని..పోసిన నారును ఇలా..చీరల కాంపౌడ్‌ లోపల పోసేసుకున్నారు.

బయ్యారం : చుట్టూ చీరలు..తడిక మాదిరి చుట్టేశారు. వేలాది రూపాయలు వెచ్చించి మిరప గింజలు కొని..పోసిన నారును ఇలా..చీరల కాంపౌడ్‌ లోపల పోసేసుకున్నారు. పశువులు తొక్కకుండా కాపాడుకునేందుకు బయ్యారంలో రైతులు ఈ ఉపాయం చేశారు. అప్పుడే వస్తున్న మొలకలను అస్తమానం కాపలా కాయలేక, వదిలేస్తే వచ్చే నష్టం భరించలేక..ఇదిగో ఇలా చీరలతో రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారు. వారెవ్వా..భలే ఐడియా వేశారే..అని కొందరు రైతులు ఆశ్చర్యపోతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement