హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వాలి : శైలజనాథ్ | s sailajanath demans water for HLC canal | Sakshi
Sakshi News home page

హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వాలి : శైలజనాథ్

Jul 16 2016 6:56 PM | Updated on Mar 18 2019 9:02 PM

హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగు నీరివ్వాలని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు.

అనంతపురం సెంట్రల్ : హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగు నీరివ్వాలని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వలన మిడ్‌పెన్నార్, సౌత్, నార్త్ కెనాల్స్‌తో పాటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టును బీడుపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరిచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు మళ్లించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, నాయకులు నాగరాజు, వాసు, అగిశం రంగనాథ్  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement