'కేసీఆర్కి పరాభవం తప్పదు' | S Jaipal reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కి పరాభవం తప్పదు'

Nov 12 2015 12:17 PM | Updated on Sep 3 2017 12:23 PM

'కేసీఆర్కి పరాభవం తప్పదు'

'కేసీఆర్కి పరాభవం తప్పదు'

ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ జైపాల్రెడ్డి నిప్పులు చెరిగారు.

వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర మాజీ మంత్రి,  కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ జైపాల్రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం వరంగల్లో జైపాల్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ది అహంకార పాలన అని ఆయన అభివర్ణించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించి.. దళితులను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. 16 నెలల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు.  

ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం అయినట్లే... తెలంగాణ సీఎం కేసీఆర్కి కూడా వరంగల్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమతమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి వరంగల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement