రూపాయికే లీటర్ మంచి నీరు | rupee per liter of water | Sakshi
Sakshi News home page

రూపాయికే లీటర్ మంచి నీరు

Jul 24 2016 7:41 PM | Updated on Sep 4 2018 5:21 PM

రూపాయికే లీటరు మంచినీటిని అందించే ఏటీఎంలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ముఖ్యంగా బస్టాండ్‌లలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు.

-బోయినపల్లిలో పోలీసు స్టేషన్ వద్ద వాటర్ ఏటీఎం ప్రారంభం
కంటోన్మెంట్(హైదరాబాద్‌సిటీ)

రూపాయికే లీటరు మంచినీటిని అందించే ఏటీఎంలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ముఖ్యంగా బస్టాండ్‌లలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. పరిమళ్ సర్వజల్ పేరిట కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన రూపాయికే లీటరు మంచినీటిని అందించే ఏటీఎంను ఎంపీ మల్లారెడ్డితో కలిసి ఆదివారం మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.

 

కంటోన్మెంట్ పరిధిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును నగరంలోనూ విస్తరించేలా తన వంతు ప్రయత్నం చేస్తామన్నారు. బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని ప్రత్యక్షంగా చూసి బోర్డు ఆధ్వర్యంలో ‘పరిమళ్ సర్వజల్’ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామన్నారు. ఒక్క రూపాయికే లీటరు శుద్ది చేసిన చల్లని తాగునీటిని అందించే ఈ మిషన్ సోలార్ పవర్ ద్వారా పనిచేస్తుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే కంటోన్మెంట్ వ్యాప్తంగా త్వరలో మరిన్ని ఏటీఎంలను ప్రారంభిస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement