రోడ్డు రవాణా సంస్థ నష్టాలకు అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే కారణమని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి ఆరోపించారు.
2015 ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించి 2016 జూలై నుంచి పెరిగిన డీఏను బకాయిలతోపాటు చెల్లించాలని కోరారు. సంస్థను నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. మెడికల్ అన్‌ఫిట్ జాబితాలోని కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, కారుణ్య నియామకాలు చేపట్టి మిగిలిన వారికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సులను రద్దు చేయాలని, ఇప్పటి వరకు అద్దె బస్సుల్లో సంస్థకు చెందిన కండక్టర్లను నియమించాలన్నారు. కార్యక్రమంలో రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మజీద్, రీజినల్ కార్యదర్శి రాబర్ట్, నాయకులు ఎల్లన్న, 1, 2 డిపోల కార్యదర్శులు రమాంజనేయులు, ఆర్‌వీఎం రావు తదితరులు పాల్గొన్నారు.