ఆర్టీసీ సీసీఎస్‌ పోరులో సమాన ఫలితాలు | RTC ccs similar results in fighting | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సీసీఎస్‌ పోరులో సమాన ఫలితాలు

Dec 17 2016 2:36 AM | Updated on Sep 4 2017 10:53 PM

ఆర్టీసీ సీసీఎస్‌ పోరులో సమాన ఫలితాలు

ఆర్టీసీ సీసీఎస్‌ పోరులో సమాన ఫలితాలు

జిల్లాలో శుక్రవారం జరిగిన ఆర్టీసీ సీసీఎస్‌ ఎన్నికల పోరులో ప్రధాన యూనియన్ లు ఎన్ ఎంయూ, ఎంప్లాయీస్‌ యూనియన్ సమ ఫలితాలను కైవసం చేసుకున్నాయి.

ఎన్ఎంయూ –16, ఎంప్లాయీస్‌ యూనియన్ –16
తిరుపతి కల్చరల్‌: జిల్లాలో శుక్రవారం జరిగిన ఆర్టీసీ సీసీఎస్‌ ఎన్నికల పోరులో ప్రధాన యూనియన్ లు ఎన్ ఎంయూ, ఎంప్లాయీస్‌ యూనియన్ సమ ఫలితాలను కైవసం చేసుకున్నాయి. ఎన్ ఎంయూను ఓడించడమే లక్ష్యంగా ఎంప్లాయీస్‌ యూనియన్ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మిక పరిషత్‌ వంటి యూనియన్ ల కూటమితో సీసీఎస్‌ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలిపింది. అయితే ఎన్ ఎంయూ సీసీఎస్‌ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసి ఎంప్లాయీస్‌ యూనియన్ కూటమికి ధీటుగా నిలిచింది. తిరుమల –2, మంగళం–1, చి త్తూరు 2–2, మదనపల్లి1–1, మదనపల్లి 2–2, పీలేరు–2, పలమనేరు–1, సత్యవేడు –1, వర్క్‌షాప్‌–1 చొప్పున మొత్తం –15          ఎన్ఎంయూ అభ్యర్థులు గెలుపొందగా తిరుపతి డిపోలో యూ నియన్ బలపరుస్తున్న కార్మిక పరిషత్‌ అభ్యర్థి గెలుపొందారు.

దీంతో ఎన్ఎంయూ 16 మంది అభ్యర్థులు గెలుపొందారు. కాగా ఆర్‌ఎం ఆఫీసు, చిత్తూరు, మంగళం వంటి డిపోల్లో రెండు మూడు ఓట్లతో ఎన్ఎంయూ అభ్యర్థులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అలాగే కూటమితో బరిలోకి దిగిన ఎంప్లాయీస్‌ యూనియన్  చి త్తూరు1–2, తిరుపతి –2, మంగళం–1, చిత్తూరు1–2, చిత్తూరు2–1, కుప్పం–2, శ్రీకాళహస్తి–2, వర్క్‌షాపు–1, అలిపిరి–2 మొ త్తం 14 స్థానాల్లో ఎంప్లాయీస్‌ యూనియన్ గెలుపొందారు. అలాగే యూనియన్ బలపరుస్తున్న అభ్యర్థులు మదనపల్లి1–1, ఆర్‌ఎం ఆఫీసులో ఒకటి, మొత్తం 16 సీట్లను కైవసం చేసుకుంది.

ప్రశాంతంగా ఆర్టీసీ సీసీఎస్‌ ఎన్నికలు  
ఆర్టీసీ కో–ఆపరేటీవ్‌ క్రెడిట్‌ సొసైటీ(సీసీఎస్‌) ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి.  జిల్లాలోని 14 డిపోలతో పా టు తిరుపతిలోని వర్క్‌షాపు, ఆర్‌ఎం ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన 16 పోలింగ్‌ కేంద్రాల్లో పగడ్భందీగా ఎన్నికలు సాగాయి. ఐదేళ్ల కొసారి ఈ సీసీఎస్‌ ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ.  ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా  ఓటర్లు 32 మంది డెలిగేట్స్‌ను ఎన్నుకుంటారు.  ఇలా అన్ని జిల్లాల నుంచి ఎంపికైన  డెలిగేట్స్‌ కలిసి  సీసీఎస్‌కు 9 మంది డైరెక్టర్లు ఎంపిక చేసి వారి ద్వారా పాలన సాగిస్తారు.  ప్రస్తుతం సీసీఎస్‌లో ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్ కు చెందిన పాలక మండలి కొనసాగుతోంది. 

ఇప్పటికే అధికార యూనియన్ గా కొనసాగుతున్న నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్ ఈ ఏడాది సీసీఎస్‌ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారం చేసింది. ఈ మేరకు తమ అభ్యర్థులను ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిపింది. అయితే ఎంప్లాయీ స్‌ యూనియన్ అటు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్, ఇటు ఆర్టీసీ వైఎస్‌ఆర్‌ మ జ్దూర్‌ యూనియన్ మద్దతుతో సీసీఎస్‌ ఎన్నికల బరిలో అభ్యర్థులను పోటీకి దిం పారు. అధికార పార్టీ అనుబంధమైన కార్మిక పరిషత్‌ కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపింది.   శుక్రవారం  ఉదయం   నుంచి సాయంత్రం  వరకు కార్మికులు    ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement