ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం రాపర్ల వద్ద శుక్రవారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు.
ప్రకాశం: చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. రైలు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్దకు రాగానే గుర్తుతెలియని దుండగులు చైన్ లాగి రైలును నిలిపి వేసి దోపిడీకి యత్నించారు.
దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై.. గాలిలోకి కాల్పులు జరపారు. ఇది గుర్తించిన దుండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఈ ఘటనలో ఎమైనా దోపిడీ జరిగిందా అని రైల్వే పోలీసులను ప్రశ్నించగా.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.