ఘనంగా వరలక్ష్మీ వ్రతం | richly varalakshmi wary | Sakshi
Sakshi News home page

ఘనంగా వరలక్ష్మీ వ్రతం

Aug 12 2016 5:42 PM | Updated on Sep 4 2017 9:00 AM

ఘనంగా వరలక్ష్మీ వ్రతం

ఘనంగా వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. మహిళలు, యువతులు ఆలయాలకు వెళ్లి వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు.

లక్కిరెడ్డిపల్లె: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. మహిళలు, యువతులు ఆలయాలకు వెళ్లి వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. లక్కిరెడ్డిపల్లెలోని రెడ్డివారిపల్లెకు వెళ్లే దారిలోని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, మర్రిచెట్టు వద్ద వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనంతపురం గ్రామంలో వెలసిన అనంతపురం గంగమ్మ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆలయాలకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement