పీఆర్‌ ఇంజనీర్లపై ఒత్తిడి తగ్గాలి | Remove burden on PR Engineers | Sakshi
Sakshi News home page

పీఆర్‌ ఇంజనీర్లపై ఒత్తిడి తగ్గాలి

Sep 18 2016 10:36 PM | Updated on Sep 4 2017 2:01 PM

పీఆర్‌ ఇంజనీర్లపై ఒత్తిడి తగ్గాలి

పీఆర్‌ ఇంజనీర్లపై ఒత్తిడి తగ్గాలి

గూడూరు : పంచాయతీరాజ్‌ ఇంజనీర్లపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఒత్తిళ్లు తగ్గాలని పంచాయతీరాజ్‌ డిప్లొమో ఇంజనీర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ అహ్మద్‌ కోరారు.

గూడూరు : పంచాయతీరాజ్‌ ఇంజనీర్లపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఒత్తిళ్లు తగ్గాలని పంచాయతీరాజ్‌ డిప్లొమో ఇంజనీర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ అహ్మద్‌ కోరారు. పట్టణంలోని పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఆదివారం పీఆర్‌ డిప్లొమా ఇంజనీర్ల సర్వసభ్య సమావేశం జరిగింది. రియాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ముఖ్యంగా క్షేత్రస్థాయి పీఆర్‌ అధికారులకు బయోమెట్రిక్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీన జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో జేఏసీ తలపెట్టిన ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. సమస్యలను రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నా హామీలు ఇస్తోందే గానీ, సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఇంకా అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, అసోసియేట్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్‌రావు, జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ మున్వర్, గూడూరు డివిజన్‌ ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి మధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement