విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల రిలే దీక్షలు | Relay electrical contract workers strike | Sakshi
Sakshi News home page

విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల రిలే దీక్షలు

Nov 22 2016 1:36 AM | Updated on Sep 5 2018 1:52 PM

విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల రిలే దీక్షలు - Sakshi

విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల రిలే దీక్షలు

విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రలోని విద్యుత్ శాఖ ఎస్‌ఈ

ఆదిలాబాద్ టౌన్ : విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రలోని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కా ర్యాయలం ఎదుట ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ట్రెడ్ యూ నియన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం చైర్మన్ వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెఎల్‌ఎం, జెపీఏ, జూని యర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్, వాచ్‌మెన్, డ్రైవర్ పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయాలని తెలిపారు.

ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలుగా మార్చాలని అన్నారు. గతంలో కాంట్రాక్టు కార్మికులతో విద్యుత్ శాఖ మంత్రి చర్చలు జరిపిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలని అన్నారు. సంఘం కన్వీనర్ గోపాల్‌రావు, డివిజన్ చైర్మన్ రాజేశ్వర్, డివిజన్ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. దీక్షలు చేపట్టిన వారిలో నర్సింగరావు, చంద్రశేఖర్, ప్రేమ్‌కుమార్, ప్రసాద్, బాపురావు, సుభాష్, అజయ్, రామకృష్ణ, రవి, నిశ్కాంత్ ఉన్నారు. వీరికి పలువురు సంఘీభావం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement